చంద్రబాబు అపరిచితుడు, లోకేష్ గొప్పల కోసమే: కన్నా

First Published Jun 22, 2018, 6:52 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఆయన అపరిచితుడిగా అభివర్ణించారు. 
ముఖ్యమంత్రి ఎక్కడ ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని ఆయన అన్నారు. 

శుక్రవారం విజయనగరంలో జరిగిన బీజేపీ విసృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దోచుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, అవినీతికి పాల్పడటానికి కేంద్రం నిధులు ఇవ్వాలా అని అడిగారు. పట్టిసీమ నుంచి పుష్కరాల వరకూ అన్నీ అవినీతి పుట్టలేనని వ్యాఖ్యానించారు.

పంచాయతీ రాజ్ శాఖ ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రానిదేనని, నారా లోకేష్ గొప్పలు చెప్పుకోవడానికి ఆ శాఖను అప్పగించారని ఆయన అన్నారు.  చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదని, దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం చెప్తేప్రత్యామ్నాయం చూపించలేదని ఆయన ్న్నారు. 

దానికి ముందే ప్యాకేజీ మాట్లాడుకున్నారని, అందుకే సాధ్యం కాదని తెలిసినా ఇంకా మాట్లాడుతున్నరని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కింద 5 వేల కోట్ల రూపాయలు అడిగితే.. కేంద్రం 16,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని అన్నారు. 30 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇమ్మని అడిగితే స్వప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరీ 16,500 కోట్లు వదులుకున్నారని విమర్శించారు

ఇప్పటి వరకూ పక్కనే ఉన్న కర్ణాటకకు కేంద్రం కేవలం 75 వేల కోట్ల రూపాయలను ఇస్తే ఏపీకి మాత్రం ఒక లక్ష 55 వేల కోట్ల రూపాయలను ఇచ్చిందని తెలిపారు. నాలుగేళ్లలోయువత, దళిత, మహిళా, రైతు సంక్షేమానికి ప్రధాని తీసుకున్న చర్యలపై  కరపత్రాలు వేసి పంచగలమని చెబుతూ చంద్రబాబు పంచగలరా అని అడిగారు. 

సొమ్మొకడిది.. సోకు మరొకడిది అన్న విధంగా పోలవరం తన కల అని చెప్పుకోవడం చూస్తే నవ్వు వస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ నిధుల విషయంలో ప్రధానిపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. విభజన హామీలను కేంద్రం అమలు చేస్తుండనడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదని ఆయన చెప్పారు.

click me!