చంద్రబాబు కు ముద్రగడ కొత్త డెడ్ లైన్

Published : Sep 12, 2017, 01:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబు కు ముద్రగడ కొత్త డెడ్ లైన్

సారాంశం

అంబేద్కర్ వర్ధంతి డిసెబర్ 6 లోపు కాపులకు బిసి రిజర్వేషన్లు అమలు చేసి తీరాలి ముఖ్యమంత్రిగారూ రోజూ పడుకునే ముందొకసారి మీరేంచేస్తున్నారో గుర్తు తెచ్చకోండి మానవ హక్కులు ముఖ్యమంత్రికే కాదు, అందరికి ఉంటాయి ఊపిరి ఉన్నంత వరకు కాపుజాతిపోరాటంలో వెనకడుగు వేసేది లేదు

రాజమండ్రిలో  గోదావరి పుష్కరాల సందర్బంగా   నిర్దేశించిన చోట కాకుండా  వేరే చోట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఆయన కుటుంబ సభ్యులు స్నానమాచరించేందుకు అనుమతి ఉందాఅని కాపురేజర్వేషన్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.

తన ఛలో అమరావతి పాదయాత్రను పోలీసులతో, నిషేధాజ్ఞలతో అణచేస్తున్నందుకు నిరసనగా  ఆయన ఈ రోజు  ముఖ్యమంత్రికి మరొక బహిరంగ లేఖ రాశారు.

అంబేద్కర్ వర్ధంతి డిసెబర్ 6 లోపు కాపులకు బిసి రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని ఈ లేఖలో కొత్త డెడ్ లైన్ ప్రకటించారు.

ఈ లేఖలో గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటకు ఆపైన 21 మంది చనిపోయేందుకు కారణమయిన ముఖ్యమంత్రి స్నానాలకు అనుమతి అవసరం లేనపుడు ఎన్నికల హామీ గుర్తుచేసేందుకు అమరావతి ని కాలినడకన వెళ్లాలనుకుంటున్న కాపుయాత్రకు అనుమతి అడగటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఈ రెండు పేజీల లేఖ లో ఆయన  అనేక విషయాలను ప్రస్తావించారు.

తాను చేస్తున్న పనులు సబబుగా ఉన్నాయో లేదో ఒక సారి రోజు రాత్రి నిద్రపోయేటపుడు గుర్తు చేసుకోవాలని ముద్రగడ సూచించారు.

‘‘మీరు రాత్రులు నిద్రకు ఉపక్రమించే సమయంలో మీరు చేసే పనుల గురించి ఆలోచన చేయండి. ఓట్లు వేసిన ప్రజలకున్న అనేక సమస్యల పై రోడ్డు మీదకు వస్తే దొరికిన వారిని దొరికినట్లు మరల రోడ్డు మీదకు రాకుండా లాఠీలతో  విరగ్గొట్టమని, కేసులలో ఇరికించమని, బాండ్స్ లక్ష రెండు లక్షలకు పోలీస్ స్టేషన్లో వ్రాయించుకోమని ఆదేశాలు ఇవ్వడం మీ దృష్టిలో తప్పులేందుంటున్నారా? ప్రజలు తన్నించుకోవడానికే నా మీకు ఓట్లు వేసింది?,’’ అని ఆయన ప్రశ్నించారు.

 ’‘‘బ్రిటిష్ వారి పాలన మాజాతికి ఉన్న బిసి రిజర్వేషన్లను తీసి వేయాలి అనుకున్నపుడు బాబా సాహేబ్ అంబేద్కర్ గారు లండన్ వెళ్లి కాపాడిన మహాను భావుడు. వారివర్ధంతి 06.12.2017. ఆలోపు మా బిసి రిజర్వేషన్లు అమలు చేయాలి. అలాగ చేయనపుడు మా మా దగ్గిర రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. మీ నిర్ణయం బట్టి ఏదో ఒక టి అమలు చేస్తాం. ఊపిరి ఉన్నంతవరకు  జాతి కోసం అడగు వెనక్కి వేయనండి,’’ అనిముద్రగడ హెచ్చరిక చేశారు.

 

PREV
click me!

Recommended Stories

janasena arava sridhar: రెండు రోజుల క్రితం శ్యామలతోతన బాధ వెళ్లబోసుకున్న బాధితురాలు | Asianet Telugu
Janasena arava sridhar Controversy: మరో వీడియో విడుదల చేసిన రైల్వేకోడూరు మహిళ | Asianet News Telugu