పవన్ ను కాదని మీకు ఓటేశాం: జగన్ కు ముద్రగడ లేఖ

Published : Jul 09, 2019, 11:50 AM IST
పవన్ ను కాదని మీకు ఓటేశాం: జగన్ కు ముద్రగడ లేఖ

సారాంశం

2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని ఆయన ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డిని కోరారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నామని చెప్పారు. 

ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు యదార్థమని నమ్మితేనే కాపు జాతికి ఉపకారం చేయాలని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu