
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్‌పై ముద్రగడ తన లేఖ ద్వారా జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను కోరారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు.
ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తీసుకొచ్చింది. దీని కింద.. గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో పూర్తి యాజమాన్యం హక్కులు కల్పించనున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలు చొప్పున ఏకకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొంది. దీనిని వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా కూడా వ్యహరిస్తున్నారు. ఇళ్ల కోసం తీసుకున్న రుణాలు పూర్తి చెల్లించకుండా ఈ పథకం వల్ల లబ్ది పొందుతారని ప్రభుత్వం తెలిపింది.అయితే దీనిపై విపక్షాలు, కొందరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, తాజాగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఓటీఎస్ కింద రెండు వాయిదాల్లో చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది, దీపావళి పండగల సమయాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. రుణం చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్ వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ పచ్చ జెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలుగా ఓటీఎస్ చార్జీలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.