కన్నాభాయ్ అనే అకౌంట్ పేరుతో ‘మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే, వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతోపాటు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫణిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు జనసేన మద్దతుదారుడని చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అమరావతి : human bombగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని Social mediaల్లో పోస్టులు పెట్టిన యువకుడిని cid సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను Cybercrime డిఎస్పి రాధిక మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజ పాలెం పవన్ ఫణి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న Twitter లో పెట్టిన పోస్ట్ పై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్లు తెలిపారు.
కన్నాభాయ్ అనే అకౌంట్ పేరుతో ‘మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే, వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతోపాటు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫణిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు జనసేన మద్దతుదారుడని చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అందుకే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నిందితుడు హైదరాబాద్ లోని ఓ సంస్థలో సేల్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడని ఆమె తెలిపారు. పవన్ కల్యాణ్ వీరాభిమానినని విచారణ సమయంలో తెలిపినట్లు వెల్లడించారు.
టెక్నాలజీతో గుర్తించిన సీఐడీ..
సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్ల ద్వేషంతో ఆయనను చంపాలంటూ ఈ నెల 16న ట్వీట్ చేసిన నిందితుడు అదేరోజు రాత్రి దాన్ని తొలగించాడు. ట్విటర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సీఐడీ సైబర్ నేరాల విభాగం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడు ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రిని హతమారిస్తే ప్రభుత్వం కూలిపోతుందని విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు...
అభ్యంతరకర, అశ్లీల, శాంతి భద్రతల విఘాతం కలిగించేలా చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ విభాగం హెచ్చరించింది. తప్పుడు ఖాతాల ద్వారా పోస్టింగ్ లు చేసి.. ఆ తరువాత డిలీట్ చేసినా నిందితులు తప్పించుకోలేరని హెచ్చరించింది. సోషల్ మీడియాలో పోస్టింగులు చేసేముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించింది.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తితో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్ఫష్టం చేసింది. హింస, అశాంతి రేకెత్తించే వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపింది.
వాక్ స్వాతంత్రం అంటూ సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఎలాపడితే అలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా, విమర్శించినా, బుల్లీయింగ్ చేసినా ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు.. అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం ఇలాంటి సైబర్ క్రైం నేరాల మీద ఉక్కుపాదం మోపుతోంది. అనేక యూట్యూబ్ ఛానల్స్ ను మూయిస్తోంది. అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.