పవన్ ది రాజకీయం.. నాది ఉద్యమం.. ముద్రగడ

Published : Nov 24, 2018, 11:08 AM IST
పవన్ ది రాజకీయం.. నాది ఉద్యమం.. ముద్రగడ

సారాంశం

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. మరోసారి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. మరోసారి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.  2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు.. కాపులకు రిజర్వేషన్లు తీసుకువస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అధికారంలో వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా.. ఈ అంశంపై ఇప్పటి వరకు చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నది లేదు. ఈ విషయంపై ఎప్పటి నుంచో పోరాడుతున్న ముద్రగడ.. మరోసారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఏపీలో ఎన్నికలు వచ్చే లోపు.. చంద్రబాబు అంశం పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి... తాము ఉద్యమం చేయాలా వద్దా అనే విషయం ఆధారపడి ఉంటుందన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే.. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పవన్ జనసేన పార్టీ.. ఒక రాజకీయ పార్టీ అని , తమది ఉద్యమం అని.. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ముద్రగడ జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!