బొమ్మను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

Published : Nov 24, 2018, 10:59 AM IST
బొమ్మను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

సారాంశం

స్థానికులు క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులపై దాడి చేశారు. వారిపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.

విశాఖపట్నం: ఓ బొమ్మను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ బొమ్మ ఘర్షణలకు కారణం కావడంతో ఆ పనిచేశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు కిరాణ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

వారు ఓ ఆడపిల్ల బొమ్మను తీసుకుని వచ్చారు. ఆ బొమ్మను వెరైటీ దుస్తులతో రోజుకో రకంగా అలంకరిస్తూ వస్తున్నారు. అయితే, అంతటి ఆగడం లేదు. ఆ బొమ్మ రోజుకో ఇంటి ముందు దర్శనమివ్వసాగింది.

దాంతో స్థానికులు క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులపై దాడి చేశారు. వారిపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా వారు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు.

తాము క్షుద్రపూజలు చేయడం లేదని శ్రీనివాస రావు దంపతులు అంటున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో బొమ్మను తీసుకొచ్చామని, దాన్ని అలంకరిస్తూ తమ మురిపెం తీర్చుకుంటామని వారంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu