
కాపుల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. వారం రోజుల క్రితం ముద్రగడ ఛలో అమరావతి యాత్రను ప్రారంభిస్తే పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకుని ఇంట్లో అనే హౌజ్ అరేస్ట్ చేశారు. వారం రోజుల పాటు ఆయన హౌజ్ అరేస్ట్ నిన్నటితో పూర్తయింది. నేడు ఉదయం మరోసారి ఛలో అమరావతి పాదయాత్రకు ముద్రగడ సిద్దమయ్యాడు. ఇంటి నుంచి బయటకు రాగానే ముద్రగడను అడ్డుకున్న పోలీసులు. కిర్లంపుడిలో బారీగా పోలీసుల బలగాలు చేరుకున్నారు. ఆయన పాదయాత్రను అడ్డుకున్నారు. ముద్రగడ పాదయాత్రను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముద్రగడ మాట్లాడుతూ నేను స్వచ్చందంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. లాండ్ ఆర్డర్ సమస్య అంటున్నారు, మరి మా సమస్య పరిష్కారం ఎలా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇసుక దొపిడికి, బంగారు షాపులు కొల్లగొట్టడానికి పాదయాత్ర చేయడం లేదని, కాపులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం ముందు ఉంచడానికి పాదయాత్ర చేస్తున్నాం అని ఆయన పెర్కొన్నారు.