టిడిపికి 140 సీట్లు ఖాయం...ఏంటి నిజమే?

Published : Aug 03, 2017, 09:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
టిడిపికి 140 సీట్లు ఖాయం...ఏంటి నిజమే?

సారాంశం

వచ్చే ఎన్నికల్లో టిడిపికి నిజంగానే 140 సీట్లు వచ్చే పరిస్ధితే ఉంటే ఇపుడు నంద్యాల ఉపఎన్నికల్లో చేస్తున్న గోలంతా ఏంటి? ఒక ఉపఎన్నికలో అదికూడా ఫిరాయింపు నియోజకవర్గంలో గెలవటానికి ఎన్ని అవస్తలు పడుతున్నదో అందరూ చూస్తున్నదే. ప్రచారం చేస్తున్న మంత్రులని కాదు ఏకంగా చంద్రబాబునాయుడునే గ్రామాల్లో జనాలు నిలదీస్తున్న విషయం అందరూ చూసిందే.

‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి 140 అసెంబ్లీ స్ధానాల్లో విజయం సాధిస్తుంది’...ఇది నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. బుధవారం ఓ మీడియాకు లోకేష్ ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో తమకు 140 సీట్లు వస్తాయని చెప్పారు. 2019లో భాజపా, జనసేనతో కలిసే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పటంలో తప్పేమీలేదు. ఆపాటి నమ్మకం లేకపోతే రాజకీయాల్లో ఉండలేరు కదా? కానీ లోకేష్ చెప్పిన మాటలు కాస్త వినటానికి అతిగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో టిడిపికి నిజంగానే 140 సీట్లు వచ్చే పరిస్ధితే ఉంటే ఇపుడు నంద్యాల ఉపఎన్నికల్లో చేస్తున్న గోలంతా ఏంటి? ఒక ఉపఎన్నికలో అదికూడా ఫిరాయింపు నియోజకవర్గంలో గెలవటానికి ఎన్ని అవస్తలు పడుతున్నదో అందరూ చూస్తున్నదే. ప్రచారం చేస్తున్న మంత్రులని కాదు ఏకంగా చంద్రబాబునాయుడునే గ్రామాల్లో జనాలు నిలదీస్తున్న విషయం అందరూ చూసిందే. గ్రామస్తులకు సమాధానం చెప్పుకోలేక దబాయించి వాళ్ళ నోళ్ళు మూయిస్తున్న వైనమూ అందరూ చూసిందే.

ఈ పరిస్ధితి ఒక్క నంద్యాలలోనే కాదు దాదాపు అన్నీ నియోజకవర్గాల్లోనూ ఉంది. ఏదో ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణం వల్ల నంద్యాలలో ఎన్నిక అనివార్యమైంది కాబట్టి జనాల స్పందన బయటపడుతోంది. ఆ విషయం తెలుసే కదా ఫిరాయింపులతో రాజీనామాలు చేయించకుండా నెట్టుకుస్తున్నది? నంద్యాల సెగ లోకేష్ కూ బాగానే తగిలింది. ఒక్క నంద్యాలలో కాదు, కడప, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కూడా డ్వాక్రా మహిళల రూపంలో లోకేష్ కు నిరసనలు బాగానే ఎదురయ్యాయి.

ఇక, రాష్ట్రపతి ఎన్నకల్లో వైసీపీ, భాజపాకు మద్దతివ్వటాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారు లోకేష్. పోయిన ఎన్నికల్లో టిడిపి కూటమి-వైసీపీకి వచ్చిన 5 లక్షల ఓట్ల తేడా గురించి మాట్లాడుతూ, అసలు ఏ లెక్కన తేడా 5 లక్షలే అని ఎదురుప్రశ్నించి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. టిడిపికి కొన్ని నియజకవర్గాల్లో 40 వేల మెజారిటీ కూడా వచ్చిందన్నారు. పైగా వైసీపీకి కడప, కర్నూలులో మాత్రమే మెజారిటీ సీట్లు వచ్చాయని చెప్పటం విచిత్రంగా ఉంది.

చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో వైసీపీ 8 సీట్లు గెలుచుకున్న విషయం లోకేష్ మరచిపోయినట్లున్నారు. ఇక రెండు పార్టీల మధ్య ఓట్ల తేడాను నియోజకవర్గంతో పోల్చి చూడరన్న విషయం కూడా లోకేష్ తెలీదు. మొత్తం 175 నియోజవకర్గాల్లో ఏ పార్టీకి పోలైన ఓట్లెన్ని అని లెక్కేస్తే రెండు పార్టీల మధ్య తేడా 5 లక్షలే.

 

  

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu