2024లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు వైసీపీ మద్దతుతోనే సాధ్యం..: విజయసాయిరెడ్డి

Published : Jul 17, 2023, 10:01 AM IST
2024లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు వైసీపీ మద్దతుతోనే సాధ్యం..: విజయసాయిరెడ్డి

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం వైసీపీ మద్దతుతోనే సాధ్యమవుతుందని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం  దేశంలో ఓవైపు విపక్షాలు కూటమి ఏర్పడేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎన్డీయే పక్షాలతో సమావేశానికి సిద్దమైంది. ఈ పరిణామాలపై స్పందించిన విజయసాయి రెడ్డి.. 2024లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం వైసీపీ మద్దతుతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం ట్విట్టర్‌‌లో ఓ పోస్టు చేశారు. 

Also Read: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. బ్యాటరీ బాక్స్‌లో చెలరేగిన మంటలు..

‘‘30 పార్టీలతో కూడిన ఎన్డీయే ఢిల్లీలో.. 24 విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమవుతున్నాయి. అయితే ఈసారి 2024లో ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా వెళుతుంది. కేంద్రంలో ప్రభుత్వం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వైసీపీకి ఏపీ ప్రజల ఆశీర్వాదం, ప్రజాభిమానం ఉంది. జాతీయ మీడియాతో సహా ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేలు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 


ఇక, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలను వైసీపీ కైవసం చోటుచేసుకుంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల వైసీపీ విజయం సాధించింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారం కైవసం చేసుకుంది. ఇక, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరకపోయినా.. పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బయటి నుంచే వైసీపీ మద్దతు ఇస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్