వైసీపీ గ్రాఫ్ పడిపోయింది.. ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్..!

By telugu news teamFirst Published Sep 28, 2021, 10:12 AM IST
Highlights

రాష్ట్రంలో మద్యం, రహదారులు, అప్పులు, తదితర అంశాలతో పరిస్థితి మారిపోయిందని.. తమ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన కామెంట్స్ చేశారు. ఆరు నెలల కిందట జరిగిన ఎన్నికల ఫలితాలు ఇప్పుడు విడుదలయ్యాయని.. వాపును చూసి బలుపు అనుకోవద్దంటూ రఘురామ పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం, రహదారులు, అప్పులు, తదితర అంశాలతో పరిస్థితి మారిపోయిందని.. తమ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పే దానిలో వాస్తవం ఉందని ఆయనకు వంద శాతం అండగా ఉంటానన్నారు. ఏడాదికి రూ.1200 నుంచి రూ..1600 కోట్ల సినీ వ్యాపారం జరుగుతోందన్నారు. అందులో జీఎస్టీ రూపంలో వచ్చేది 12శాతమైతే అందులోనూ రాష్ట్రానికి దక్కేది ఆరు శాతమే. రూ.1200 ట్రాక్టర్ ఇసుకను రూ.7వేలకు పెంచినప్పుడు, సిమెంట్ రేటు పెంచినప్పుడు  టికెట్ల ధర ఎందుకు పెంచకూడదని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాన్ కన్నా ఎక్కువగా  తమ పార్టీకి కాపులు అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో రైతులు చట్టాలకు అనుకూలంగా వ్యవహరించిన తమ పార్టీ భారత్ బంద్ కు మద్దతివ్వడం ద్వంద్వ వైఖరేనని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రగ్స్ మాఫియాలో మాచవరం సుధాకర్ పాత్ర నామమాత్రమేనని.. దాని వెనక ఎవరో పెద్దలు ఉన్నారని రఘురామ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

click me!