కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. బాలికపై బాబాయి అత్యాచారం... !

Published : Sep 28, 2021, 09:19 AM IST
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. బాలికపై బాబాయి అత్యాచారం... !

సారాంశం

ఆమెకు ఓ కూల్ డ్రింక్ తీసుకువచ్చాడు. బాబాయి తెచ్చిన కూల్ డ్రింక్ ను ఆ అమ్మాయి సంతోషంగా తాగింది. అయితే వక్రబుద్ది ఉన్న ఆ యువకుడు అందులో మత్తుమందు కలిపాడన్న సంగతి ఆ అమ్మాయి ఊహించలేకపోయింది. కూల్ డ్రింక్ తాగిన కాసేపటికే స్పృహ తప్పి పడిపోయింది.

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రి తరువాత తండ్రిలా చూసుకోవాల్సిన బాబాయ్ బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు. వరుసకు చిన్నాన్న అయిన యువకుడు ఓ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి మూడు నెలలు అయ్యింది. కాగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన బాలి (16) పదో తరగతి పాస్ అయ్యింది. ఆమె చిన్నతాత కుమారుడు (25) గత జూన్ లో ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. 

ఆమెకు ఓ కూల్ డ్రింక్ తీసుకువచ్చాడు. బాబాయి తెచ్చిన కూల్ డ్రింక్ ను ఆ అమ్మాయి సంతోషంగా తాగింది. అయితే వక్రబుద్ది ఉన్న ఆ యువకుడు అందులో మత్తుమందు కలిపాడన్న సంగతి ఆ అమ్మాయి ఊహించలేకపోయింది. కూల్ డ్రింక్ తాగిన కాసేపటికే స్పృహ తప్పి పడిపోయింది. తన పన్నాగం పారడంతో.. స్పృహలో లేని బాలిక మీద అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా.. ఆమెను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు.

వైసీపీ విమర్శలకు పవన్ కౌంటర్: జగన్ పార్టీపై జనసేనాని సెటైర్లు

తరువాత ఇటీవల ఆ ఫొటోలు, వీడియోలు చూపిస్తూ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తాను చెప్పినట్టు వినాలని లేకపోతే వాటిని ఫేస్ బుక్, వాట్సాప్ లలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఏం చేయాలో పాలుపోయి ఆ బాలిక భయంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పేసింది. 

దీంతో అలర్ట్ అయిన తల్లిదండ్రులు వెంటనే ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో దిశ జిల్లా డీఎస్పీ సుంకర మురళీమోహన్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. విషయాలు తెలుసుకుని.. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్