ఎంపీ రఘురామకు సుప్రీంకోర్టులో భంగపాటు.. పిటిషన్ కొట్టివేత

By Mahesh KFirst Published Jul 21, 2023, 12:26 PM IST
Highlights

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులోనూ భంగపాటు ఎదురైంది. ఏపీ బేవరెజెస్ రుణాల కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది.
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో భంగపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులోనూ ఆయనకు ప్రతికూలంగానే తీర్పులు వచ్చాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాల కేసులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ధాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది.

గతంలోనే ఆయనకు ఈ కేసులో ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాల కేసులో ఏపీ హైకోర్టు రఘురామకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు, కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడం సవాల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై ఆయనకు మొట్టికాయలు కూడా వేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు, ఎ-8 గా వైఎస్ అవినాష్ రెడ్డి

కానీ, ఈ తీర్పు వెలువడి ఎనిమిది నెలలు గడిచాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. ఇంత ఆలస్యం కారణంగా తాము ఇప్పుడు ఆ పిటిషన్ పై జోక్ం చేసుకోదల్చుకోలేమని తెలిపింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

click me!