వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు, ఎ-8 గా వైఎస్ అవినాష్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 21, 2023, 10:16 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ ను  సీబీఐ దాఖలు  చేసింది. 


హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్  చార్జీషీట్ ను  కోర్టుకు సమర్పించింది  సీబీఐ, ఈ ఏడాది జూన్  30వ తేదీన  చార్జీషీట్ ను అందించింది  సీబీఐ. 140 పేజీలతో  చార్జీషీట్ ఉంది.  సెకండ్ సప్లిమెంటరీ ఫైనల్ చార్జీషీట్ గా  సీబీఐ తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఎ-8 నిందితుడిగా  సీబీఐ పేర్కొంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  2019  మార్చి  14న  పులివెందులలో హత్యకు గురయ్యారు.  అయితే ఈ హత్య  కేసును సీబీఐ విచారిస్తుంది.  చంద్రబాబు నాయుడు  సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది.  ఈ హత్య కేసును విచారించేందుకు  చంద్రబాబు సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది.  ఆ తర్వాత  అధికారంలోకి వచ్చిన  వైఎస్ జగన్ సర్కార్ కూడ మరో సిట్ ను  ఏర్పాటు చేసింది. 

Latest Videos

ఈ హత్య కేసును సీబీఐతో విచారించాలని  వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి,  టీడీపీ నేత బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు  ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు  చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశించింది.

దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ లో  ఎనిమిదో నిందితుడిగా  సీబీఐ చేర్చింది.ఈ ఏడాది ఆగస్టు 14న విచారణకు  రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ  సమన్లు జారీ చేసింది. ఈ నెల  14న  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు  ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్  పొందారు. అయితే ఈ ముందస్తు బెయిల్ ను  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి  సుప్రీంకోర్టులో  సవాల్ చేశారు.

ఈ పిటిషన్ పై  ఈ నెల  18న  సుప్రీంకోర్టు  విచారణ నిర్వహించింది. ఈ  విషయమై కౌంటర్ దాఖలు చేయాలని  సీబీఐ తరపు న్యాయవాదిని  సుప్రీంకోర్టు  ఆదేశించింది.  ఈ పిటిషన్ పై విచారణను  సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది  సుప్రీంకోర్టు.

  

click me!