ఏపీలో మరో శిరోముండనం: దళిత యువకుడికి గుండు గీయించిన సినీ నిర్మాత

Published : Aug 29, 2020, 06:59 AM ISTUpdated : Aug 29, 2020, 09:46 AM IST
ఏపీలో మరో శిరోముండనం: దళిత యువకుడికి గుండు గీయించిన సినీ నిర్మాత

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శిరోముండనం సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం పెందుర్తిలో ఓ దళిత యువకుడికి సినీ నిర్మాత గుండు గీయించాడు. సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శిరోముండనం సంఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేసిన సంఘటన తీవ్ర సంచలన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనను మరిచిపోక ముందే విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అటువంటి సంఘటనే జరిగింది. 

మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం.... సుజాతానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే యువకుడు అదే కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత ఎన్. నూతన నాయుడి ఇంట్లో పనిచేస్తున్నాడు. మూడు నెలల పాటు అతని నూతన నాయుడి ఇంట్లో పనిచేసి నెల రోజుల క్రితం మానేశాడు. 

దాంతో శ్రీకాంత్ తమ ఇంట్లో మొబైల్ దొంగతనం చేశాడని నూతన నాయడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ విషయం మీద మాట్లాడాలని చెప్పి, ఇంటికి పిలిచారు. దాంతో శ్రీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన శ్రీకాంత్ కు నూతన నాయుడు మిగతా సిబ్బంది చూస్తుండగానే గుండు గీయించాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మీద సిబ్బంది దాడి చేశారు 

ఈ విషయాన్ని బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటన మీడియా ద్వారా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు బాధితుడిని స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారిస్తున్నారు. 

అయితే నూతన నాయుడు భార్య మధుప్రియ కర్రి శ్రీకాంత్ కు గుండు గీయించినట్లు మరో వార్తాకథనం తెలియజేస్తోంది. ఈ ఘటనలో నూతన నాయుడి పాత్ర గురించి పోలీసులు విచారిస్తున్నట్లు ఆ వార్తాకథనం తెలియజేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami