ఆ ఫోటోలో తాగుతున్నది నేనే, రష్యన్ అమ్మాయిలు వైసీపీ మందు పార్టీల్లో కూడా ఉంటారు: రఘురామ సంచలనం

Published : Oct 12, 2020, 06:54 PM IST
ఆ ఫోటోలో తాగుతున్నది నేనే, రష్యన్ అమ్మాయిలు వైసీపీ మందు పార్టీల్లో కూడా ఉంటారు: రఘురామ  సంచలనం

సారాంశం

ఆ ఫోటో తనదేనని ఒప్పుకోవడానికి తాను సిగ్గు పడాల్సిన అవసరం లేదని, తానేమి తప్పు చేయలేదని అన్నారు రఘురామకృష్ణంరాజు.

గత రెండు రోజులుగా రఘురామకృష్ణంరాజు ఫోటో ఒకటి విపరీతంగా  అవుతుంది. ఆయన నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటోతో గత రెండు రోజులుగా ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు. 

ఈ ఫోటో ఒరిజినల్ ఆ కాదా అనే విషయంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రఘురామకృష్ణంరాజు ఈ ఫోటోపై క్లారిటీ ఇస్తూ... ఇందులో ఉన్నది తానే అని ఒప్పుకుంటూ... జగన్ సర్కార్ మద్యం పాలసీ పై సెటైర్లు వేశారు. 

షాంపేన్ ని క్రికెటర్లు కూడా తాగుతారన్న రఘురామ.... అందులో తప్పేమిటని ప్రశ్నించారు. ఆ ఫొటోలో తానేమి అసభ్యంగా ప్రవర్తించలేదని, ఆ అమ్మాయిని ఎక్కడ తాకలేదని అన్నారు. నోట్లో పోసినంత మాత్రాన అదేదో తప్పు చేసినట్టు కాదని, ఈ ఫొటోతో ఉన్మాదుల్లా రెచ్చిపోయారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 

వైసీపీ వారు ఇచ్చే పార్టీల్లో కూడా రష్యన్ అమ్మాయిలు ఉంటారంటూ రఘురామ చురకలు అంటించారు. "ఏముంది ఆ ఫోటోలో.. మీరు సప్లై చేసే ప్రెసిడెంట్ మెడల్, నోబెల్ ప్రైజ్ వంటి చెత్త డ్రింకులు తాగకుండా షాంపైన్ నోట్లో పోసుకుంటే బాధగా ఉందా?" అంటూ వైసీపీ ప్రభుత్వ మద్యం విధానంపై వెటకారంగా పంచులు వేశారు. 

ఆ ఫోటో తనదేనని ఒప్పుకోవడానికి తాను సిగ్గు పడాల్సిన అవసరం లేదని, తానేమి తప్పు చేయలేదని అన్నారు రఘురామకృష్ణంరాజు. ఒక తెలుగు  పార్టీలో తీసిన ఫోటో ఇది అని, రెండు మూడు సంవత్సరాల కిందటిది ఈ ఫోటో అని తెలిపారు. 

ఈ ఫోటోను ఎవరు బయటపెట్టిఉంటారో కూడా తనకు తెలుసునని, బహుశా సుబ్బారెడ్డిగారు ఈ ఫోటోను బయటపెట్టి ఉంటారని అన్నారు రఘురామ. తనకు కొన్ని అసభ్యకరమైన మెసేజ్ లు,బెదిరింపులు వస్తున్నాయని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసానని తనను అగౌరవపరిచినవారు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వార్నింగ్ సైతం ఇచ్చారు రాజుగారు. 

PREV
click me!

Recommended Stories

Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu