జైలుకు తీసుకెళ్తుండగా పట్టాభిని కొట్టారు.. పోలీసులు వివరాలు అడిగితే చెప్తాను.. రఘురామ కృష్ణరాజు సంచలనం..

By team teluguFirst Published Oct 28, 2021, 2:31 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని (Tdp leader Pattabhi) కస్టడీలో కొట్టారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని (Tdp leader Pattabhi) కస్టడీలో కొట్టారని అన్నారు. పట్టాబిని కొట్టారా లేదా అనేది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పాలన్నారు. గురువారం రఘరామ కృష్ణరాజు ఢిల్లీలో మీడియోతో మాట్లాడారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకెళ్తున్న సమయంలో పట్టాబిని కొట్టారని అన్నారు. కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిపై ఈ రకంగా చేయడం చాలా తప్పు అన్నారు. దీనిని పోలీసులు ఖండిస్తారని తనకు తెలుసని అన్నారు. 

కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని ఎంపీ రఘరామకృష్ణరాజు పేర్కొన్నారు. దానిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వానికి, పోలీసులకు తేడా లేదన్నారు. పోలీసులు ఎవరైనా తనను వివరాలు అడిగితే తాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనకువచ్చిన సమాచారం ప్రకారం ఉతికేశారని అన్నారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. కొందరి వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని రఘురామ అన్నారు. సీఎం ఆఫీసు నుంచి రాసి ఇచ్చినవి చదువుతున్నారని Raghu Rama Krishnam Raju ఆరోపించారు.

కొందరు చీడపురుగుల వల్ల వ్యవస్థ మొత్తం అపవిత్రం చేసుకునే దుస్థతి ఏపీపోలీస్ వ్యవస్థకు వచ్చిందని రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వారిని చూసి తాను బాధపడుతున్నట్టుగా చెప్పారు. కొందరు అధికారుల గురించి సమయం వచ్చినప్పుడు సాక్ష్యాలతో సహా బయటపెడతానని అన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు స్వతంత్రగా వ్యవహరిస్తారని అనుకుంటున్నానని అన్నారు. గంజాయికి సంబంధించి విజయసాయిరెడ్డి చెప్పినదాంట్లో తప్పేం లేదని.. ఇక్కడ పట్టుకోక పోవడం లేదని.. బయటి రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan)  చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిదే.  ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొందరు పట్టాభి ఇల్లు, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీ కూడా పట్టాభి వాడిన భాష దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. దీంతో పట్టాబికి విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పట్టాభి తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది. వివరాలు రాబ్టటేందుకు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే బెయిల్‌పై విడుదలైన పట్టాభి ఇప్పుడు ఎక్కడున్నారనేది సస్పెన్స్‌గా మారింది. 

ఆయన మాల్దీవులు వెళ్లారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే తాజాగా ఓ వీడియో విడుదల చేసిన Pattabhi.. తాను మాట్లాడిన వాటికి లేనిపోని అర్థాలు తీశారని అన్నారు. త్వరలోనే పార్టీలో తన విధులను నిర్వహిస్తానని చెప్పారు. తన ఇంటి పై వైసీపీ నేతలు జరిపిన దాడిలో తన భయ బ్రాంతులకు గురైందన్నారు. ఒక తండ్రిగా నా కుమార్తె బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పారు. కుటుంబంతో కలిసి బయటకెళ్తే అనేక అర్ధాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టుగా వెల్లడించారు.

click me!