మీరు చేసిందే పక్క రాష్ట్రాలు చేస్తే... జగన్ కి కేశినేని సూటి ప్రశ్న

By telugu teamFirst Published Jul 24, 2019, 10:45 AM IST
Highlights

 జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో  రాయిలా ఉందంటూ కేశినేని నాని విమర్శించారు. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై కేశినేని నాని స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో  రాయిలా ఉందంటూ కేశినేని నాని విమర్శించారు. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై కేశినేని నాని స్పందించారు.

ఏపీ ప్రభుత్వం చేసిన చట్టమే ఇతర రాష్ట్రాల వారు కూడా చేస్తే... మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. ‘‘జగన్ గారు.. పిచ్చివాడి చేతదిలో రాయిలా ఉంది మీ చేతిలో అధికారం. మీరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, పూణే, ఢిల్లీ లాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది మీ పరిస్థితి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా... పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్దేశిస్తూ అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది.దీంతోపాటు కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం, నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం మహిళలకు అవకాశం, కాంట్రాక్టు సర్వీసుల్లో మహిళలకు 50శాతం వర్కులు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు తదితర బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిలో స్థానికులకు మాత్రమే 75శాతం ఉద్యోగాలు ఇస్తామనడపంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 

click me!