అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల వాకౌట్

Published : Jul 24, 2019, 10:44 AM IST
అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల వాకౌట్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం నాడు వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తూ టీడీపీ వాకౌట్ చేసింది.

అమరావతి:  ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు మంగళవారం నాడు వాకౌట్ చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు తమకు అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు  బుధవారం నాడు శాసనసభ నుండి వాకౌట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం నాడు సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం జరిగింది.విపక్షనేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే సభా నాయకుడు సమాధానం చెప్పిన తర్వాత  విపక్షనేతకు మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదు. 

ఈ తరుణంలో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం కల్పించాలని  టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?