108 సిబ్బంది సమ్మె... చిన్నారి ప్రాణం తీసింది

By telugu teamFirst Published Jul 24, 2019, 10:14 AM IST
Highlights

గత కొంతకాలంగా తమకు జీతాలు పెంచడం లేదని... తమ సమస్యలు పరిష్కరించడం లేదని విశాఖపట్నంలో 108 సిబ్బంది సమ్మె చేపట్టారు. కాగా... వారు విధులకు హాజరు కాకపోవడం వల్ల ఓ మూడు నెలల చిన్నారి కన్నుమూసింది.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 సిబ్బంది చేపట్టిన సమ్మె... ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. గత కొంతకాలంగా తమకు జీతాలు పెంచడం లేదని... తమ సమస్యలు పరిష్కరించడం లేదని విశాఖపట్నంలో 108 సిబ్బంది సమ్మె చేపట్టారు. కాగా... వారు విధులకు హాజరు కాకపోవడం వల్ల ఓ మూడు నెలల చిన్నారి కన్నుమూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పాడేరు మండలం బురుగుచెట్టు గ్రామానికి చెందిన దంపతులకు మూడు నెలల క్రితం ఓ బిడ్డ జన్మించింది. ఆ పాపకు అనూష అని నామకరణం కూడా చేశారు. ఉన్నట్టుండి మంగళవారం చిన్నారి అస్వస్థతకు గురయ్యింది. ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే అంబులెన్స్ రావాల్సిందే. దీంతో.. 108కి కాల్ చేస్తే వారు స్పందించలేదు. వెంటనే ఆశావర్కర్ల సాయం అడిగారు. వారు కూడా స్పందించలేదు. ఈ లోపు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు విడిచింది.

108 సిబ్బంది సమ్మెలో ఉండటంతో... వారి ఫోన్ కి స్పందించలేదని తెలిసింది. కీనీసం ఆశావర్కర్లు స్పందించినా.. తమ బిడ్డ బతికి ఉండేదని అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!