సీఐ మాధవ్ పై ఫిర్యాదు చేసిన ఎంపీ జేసీ

Published : Sep 21, 2018, 09:07 PM ISTUpdated : Sep 21, 2018, 09:11 PM IST
సీఐ మాధవ్ పై ఫిర్యాదు చేసిన ఎంపీ జేసీ

సారాంశం

అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు సై అంటే సై అంటున్నారు. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తా అని సీఐ మాధవ్ అంటే ఎక్కడికి రావాలో చెప్పు అంటూ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. 

అనంతపురం: అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు సై అంటే సై అంటున్నారు. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తా అని సీఐ మాధవ్ అంటే ఎక్కడికి రావాలో చెప్పు అంటూ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. అక్కడితో ఆగని జేసీ తాజాగా సీఐ మాధవ్‌పై తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నాలుకలు కోస్తానన్న వ్యాఖ్యలను జేసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దివాకర్‌రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభోదానంద ఆశ్రమ వివాదంలో దివాకర్‌ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, ఉన్నట్టా చచ్చిపోయినట్లా అంటూ మండిపడ్డారు. మీరు ఇంతే అట్టు పోలీసుల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించారు. జేసీ వ్యాఖ్యలు చేష్టలతో పోలీసులు అధికారులు సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడైనా పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం. తస్మాత్‌ జాగ్రత్త అని కదిరి సీఐ మాధవ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి మాధవ్ పై ఫిర్యాదు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మీసం తిప్పితే హీరోవా, చూసుకొందాం,రా...:సీఐపై జేసీ

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

సిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే