ముద్దులొలికే చిన్నారులకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. కారణమదేనా?

Published : Mar 01, 2022, 06:35 AM IST
ముద్దులొలికే చిన్నారులకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. కారణమదేనా?

సారాంశం

భర్త ఇంట్లో లేని సమయంలో ఓ భార్య దారుణానికి తెగబడింది. ఇద్దరు ముద్దులొలికే చిన్నారులకు ఉరివేసి చంపి.. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసిన భర్త షాక్ అయ్యాడు. అసలేం జరిగిందో తెలియక....

అనకా పల్లి :  భార్యభర్త, ఇద్దరూ ముద్దులొలికే చిన్నారులు అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలను murder చేసి, వివాహిత suicide చేసుకున్న ఉదంతం విశాఖ జిల్లా  anakapalleలో కలకలం రేపింది. దీనికి సంబంధించి డిఎస్ పి సునీల్,  పట్టణ సీఐ భాస్కర్ రావు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన జనార్దనరావు తన అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. జనార్ధన రావు అర్జ అచ్యుతాపురంలోని Pharma Companyలో పని చేస్తున్నాడు. 

అనకాపల్లి రోడ్డు లోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు వీరికి సుదీక్ష (5), గీతాన్విక (1.5 సంవత్సరాలు) కుమార్తెలు. ఉద్యోగానికి సెలవు పెట్టి శనివారం స్వగ్రామం మెట్ట పేట వెళ్ళాడు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి భార్య అనూష ఉరేసుకుని ఉంది. కుమార్తెలు ఇద్దరు కింద పడి ఉన్నారు. వెంటనే 100కీ సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమార్తెలు ఇద్దర్నీ చున్నీతో ఉరివేసి.. వారు చనిపోయాక అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలంలో  సూసైడ్ నోట్ ను సేకరించారు. ఇది అనూష రాసిందేనా అని పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్ లోని వివరాలు, మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహిత ఆత్మహత్య వెనుక ఇంటి యజమాని పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 18న Secunderabad నాచారంలోని ఓ ఇంట్లో 26 ఏళ్ల మహిళ, 13 నెలల చిన్నారి ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారికి ఉరివేసిన మహిళ తాను కూడా suicide చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే, అదనపు కట్నం కోసం In-laws వేధించడం వల్లే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ మహిళను తెలుగు దీపికగా గుర్తించారు, 2009లో ఆమె తెలుగు చంద్రశేఖర్‌ని వివాహం చేసుకుంది. 2021, ఫిబ్రవరిలో వీరికి రుత్విక(13)నెలలు జన్మించింది. నాచారం ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ వివరాలు తెలియజేస్తూ.. "రుత్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా.. దీపిక కుటుంబం 2 తులాల బంగారు గొలుసును ఇస్తామని మాట ఇచ్చారు. కానీ ఇవ్వలేకపోయారు... దీంతో చంద్రశేఖర్ దీపికను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన కుమార్తెకు ఉరివేసి హత్య చేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

 దీపికను బయటకు వెళ్లడానికి అనుమతించేవాళ్లు కాదు.. తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యలుతో మాట్లాడనిచ్చేవారు కాదు.. అని సిద్దార్థ్ ఆరోపించారు. ఇక కూతురు రుత్విక పుట్టిన తర్వాత చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి’’ అని సిద్దార్థ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పాపకు బంగారు గొలుసు పెట్టేందుకు సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించింది. అయితే, చంద్రశేఖర్‌ పాప పుట్టినరోజుకు వారిని పిలవలేదు. దీంతో దీపికా తండ్రి దీపిక లేదా రుత్విక పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి అంగీకరించారు.

ఇక ఘటన జరిగిని ఫిబ్రవరి 17, గురువారం నాడు తల్లి, కుమార్తె వారి ఇంటి హాలులో ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే సిద్దార్థ్ ఉదయం 11 గంటలకు ఆమెను ఆన్‌లైన్‌లో చూశానని చెప్పాడు. కాగా, ఉదయం 10 గంటల సమయంలో కుమార్తెకు ఉరివేసి.. దీపిక ఆత్మహత్య చేసుకుందని సిద్దార్థ్ బావ చెబుతున్నాడు. మృతదేహాలను అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
 

 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu