ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజ్ భవన్ లో సోమవారం నాడు రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ తో జగన్ భేటీ అయ్యారని సమాచారం.
అమరావతి::ఏపీ సీఎం YS Jagan దంపతులు సోమవారం నాడు ఏపీ గవర్నర్ Biswabhusan Harichandan తో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. మార్చి ఏడవ తేదీ నుండి Andha Pradesh Assembly Budget sessions ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు Governor ను ఆహ్వానించడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా జగన్ గవర్నర్ చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ లో కీలకమైన బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మూడు రాజధానుల బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో వెనక్కి తీసుకొంది. అయితే న్యాయ పరమైన చిక్కులు లేకండా కొత్త బిల్లును తీసుకొస్తామని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ వేదికగానే ప్రకటించిన విషయం తెలిసిందే.
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయం,పాడి పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇదిలాఉంటే. 2019తో పోల్చుకుంటే రాబడులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్‌లో చేసే కేటాయింపులపై సర్కార్ ప్రత్యేక దృష్టిసారించింది. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు వారాలకు పైగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గత అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీ చీఫ్ Chandrababu Naidu తన సతీమణిపై YCP ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ సమయంలో అసెంబ్లీ నుండి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు. అయితే గత అసెంబ్లీ సమావేశాలను TDP బహిష్కరించింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ పాల్గొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే గత సమావేశాల సందర్భంగా భవిష్యత్తులో జరిగే సమావేశాలకు సంబంధించి అప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకొంటామని TDLP ప్రకటించింది