ప్రతి విషయం అడుగుతోందని.. అత్తను చంపిన కోడలు

Published : Nov 04, 2018, 12:12 PM ISTUpdated : Nov 04, 2018, 12:13 PM IST
ప్రతి విషయం అడుగుతోందని.. అత్తను చంపిన కోడలు

సారాంశం

చేసే ప్రతి పనిని అడుగుతుందనే కోపంతో అత్తగారిని అత్యంత దారుణంగా చంపింది ఒక కోడలు.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన కూసంపూడి నారాయణీదేవి తన అత్త మహాలక్ష్మీదేవితో తరచూ ఇంటిపనుల విషయంలో గొడవ పడుతూ ఉండేది

చేసే ప్రతి పనిని అడుగుతుందనే కోపంతో అత్తగారిని అత్యంత దారుణంగా చంపింది ఒక కోడలు.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన కూసంపూడి నారాయణీదేవి తన అత్త మహాలక్ష్మీదేవితో తరచూ ఇంటిపనుల విషయంలో గొడవ పడుతూ ఉండేది..

 చేసే ప్రతీ పనిలో లోపాన్ని ఎత్తి చూపుతూ.. తిడుతూ ఉండటంతో అత్తగారిపై నారాయణీదేవి ఆగ్రహం వ్యక్తం చేసేది.  ప్రతి చిన్న విషయానికి ఇద్దరు ఘర్షణకు దిగేవారు. ఈ క్రమంలో అత్తగారి వైఖరిపై విసుగు చెందిన నారాయణీదేవి ఇవాళ ఉదయం మహాలక్ష్మీదేవి నిద్రిస్తున్న సమయంలో దిండుతో ముఖాన్ని నొక్కిపట్టింది..

ఊపిరి అందకపోవడంతో మహాలక్ష్మీదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోడలిని అదుపులోకి తీసుకున్నారు. అత్తగారి ప్రవర్తనతో విసిగిపోయి తాను హత్యకు పాల్పడినట్లు నారాయణీదేవి నేరాన్ని అంగీకరించింది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే