గుంటూరులో తల్లీకూతుళ్ల దారుణ హత్య.. ఇంకా దొరకని కత్తి ??

By AN Telugu  |  First Published Aug 30, 2021, 1:23 PM IST

హత్య చేసిన తర్వాత కత్తితో నిందితుడు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలు ఉన్నాయి.  ఘటన జరిగిన ఇంటి సమీపంలోని కత్తిని పడేసి ఉంటాడని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఆదివారం ఎంత వెతికినా కత్తి దొరకలేదని పోలీసులు తెలిపారు.


సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన తల్లీకుమార్తె హత్య కేసులో నిందితుడు ఉపయోగించిన కత్తిని పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అతనే ఆయుధాన్ని తీసుకొచ్చాడా? లేక ఇంట్లో ఉన్న కత్తితో దారుణానికి ఒడిగట్టాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునసాగర్ కు చెందిన కోనూరు వెంకట సుగుణ పద్మావతి (57), ఆమె కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (31) శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

వారిని బంధువు కోనూరు శ్రీనివాసరావు హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు సెల్ ఫోన్లలో రికార్డు చేసిన వీడియోల్ని సేకరించారు. హత్య చేసిన తర్వాత కత్తితో నిందితుడు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలు ఉన్నాయి.  ఘటన జరిగిన ఇంటి సమీపంలోని కత్తిని పడేసి ఉంటాడని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఆదివారం ఎంత వెతికినా కత్తి దొరకలేదని పోలీసులు తెలిపారు.

Latest Videos

గుంటూరు: సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

 చిన్నమ్మ, చెల్లిని అమానుషంగా హత్య చేసేంత పగ అతనికి ఎందుకు అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.  పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం ఉన్నా అధికారులు దాన్ని ధ్రువీకరించడం లేదు.  ఆస్తి తగాదాలతో పాటు వారి మధ్య జరిగిన గొడవ, క్షణికావేశం ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.  స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 పద్మావతి శరీరంపై  10,  లక్ష్మీ ప్రత్యూష శరీరంపై తొమ్మిది కత్తిపోటు గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.  ఇద్దరికీ మెడ,, ఛాతి భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు.  నిందితుడిని సాధ్యమైనంత త్వరగా కోర్టులో హాజరు పరుస్తామని పట్టణ సీఐ శోభన్ బాబు చెప్పారు. 

click me!