శ్రీశైలంలో విద్యుదుత్పత్తి: తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

By telugu teamFirst Published Aug 30, 2021, 12:33 PM IST
Highlights

శ్రీశైలం రిజర్యాయర్ లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కోరింది.

అమరావతి: శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని చేపట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణ చర్యను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఓ లేఖ రాసింది. విద్యుదుత్పత్తిని ఆపేసే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

ఆ మేరకు సంబంధిత అధికారి నారాయణ రెడ్డి కేఆర్ఎంబీకి నాలుగు పేజీల లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేపట్టడం వల్ల తమ రాష్ట్రానికి, తమ రాష్ట్ర రైతాంగానికి ఏ విధంగా నష్టం వాటిల్లుతుందో ఆయన ఆ లేఖలో వివరించారు. 

శ్రీశైలం రిజర్యాయర్ లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విదుత్తును ఉత్పత్తి చేస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. తెలంగాణ జెన్మో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అననారు. తమ ప్రభుత్వం ఇండెంట్ లేకుండా తెలంగాణ విద్యుదుత్పత్రి చేపడుతోందని ఆయన అన్నారు. 

ఉమ్మడి ప్రాజెక్టుల్లో సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వాదన అసంబద్ధంగా ఉందని అన్నారు. విదుత్తు ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కోరారు.

కృష్ణా జలాల నీటి వాటాపై గత కొంత కాలంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. శ్రీశైలంలో మాత్రమే కాకుండా నాగార్జునసాగర్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేపట్టడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. తమను ఇబ్బంది పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ విమర్శిస్తోంది. 

click me!