చిన్నారులపై శానిటైజర్ పోసి.. నిప్పంటించి, తల్లి ఆత్మహత్య..

Published : Apr 23, 2021, 01:48 PM IST
చిన్నారులపై శానిటైజర్ పోసి.. నిప్పంటించి, తల్లి ఆత్మహత్య..

సారాంశం

నెల్లూరులో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలమీద శానిటైజర్ పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదఘటన స్థానికంగా కలకలం రేపింది.

నెల్లూరులో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలమీద శానిటైజర్ పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదఘటన స్థానికంగా కలకలం రేపింది.

తన ఇద్దరు చిన్నారులకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం లో చోటుచేసుకుంది. ఆత్మకూరు సిఐ సోమయ్య, ఎస్ఐ రవినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు పాలెంకు చెందిన సుబ్బులు తన ఇద్దరు చిన్నారులతో కలిసి కర్ణాటకలోని బళ్లారి వద్ద వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది.

 గురువారం బళ్లారి నుంచి సుబ్బులు తన ఇద్దరు పిల్లలతో బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరు పాలెం వద్ద దిగింది. గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్న స్మశానవాటిక స్థలంలో తనతోపాటు పిల్లలపై శానిటైజర్ పోసి నిప్పంటించింది.

ఈ ప్రమాదంలో కుమార్తె మధురవాణి (5) అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు మహేష్ మంటల వేడికి తప్పించుకుని పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

మహేష్ గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు