తండ్రిని కలుసుకున్నందుకు.. ఐరన్ రాడ్‌తో చిన్నారికి వాతలు పెట్టిన తల్లి

Published : Aug 27, 2018, 01:37 PM ISTUpdated : Sep 09, 2018, 12:10 PM IST
తండ్రిని కలుసుకున్నందుకు.. ఐరన్ రాడ్‌తో చిన్నారికి వాతలు పెట్టిన తల్లి

సారాంశం

కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడుకు, తండ్రిని కలుసుకున్నాడనే అక్కసుతో తల్లిని అనే విచక్షణ మరచి ఏడేళ్ల చిన్నారి శరీరంపై వాతలు పెట్టింది

కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడుకు, తండ్రిని కలుసుకున్నాడనే అక్కసుతో తల్లిని అనే విచక్షణ మరచి ఏడేళ్ల చిన్నారి శరీరంపై వాతలు పెట్టింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం సూళ్లూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, కృష్ణకుమారి దంపతులు విడివిడిగా ఉంటున్నారు... వీరికి ఓ ఏడేళ్ల బాబు ఉన్నాడు.. అయితే చిన్నారి తల్లి వద్దే ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఈ ఆదివారం చిన్నారికి తన తండ్రిని చూడాలనిపించి.. తల్లికి తెలియకుండా తండ్రిని కలుసుకున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమారి ఆగ్రహంతో బాలుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఐరన్ రాడ్‌ను కాల్చి కొడుకు శరీరంపై వాతలు పెట్టింది. దీనిపై తండ్రి ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే