ఆవుకు సీమంతం.. కన్నకూతురిగా గాజులు తొడిగిన యజమాని

Published : Aug 27, 2018, 01:18 PM ISTUpdated : Sep 09, 2018, 01:52 PM IST
ఆవుకు సీమంతం.. కన్నకూతురిగా గాజులు తొడిగిన యజమాని

సారాంశం

కూతురు తల్లి కాబోంతుందని ఆ కూతురిని కన్న తల్లిదండ్రులు పొందే ఆనందం వెలకట్టలేనిది.. తమ బిడ్డకు సీమంతం చేసి.. వూరంతా పండుగ చేస్తుంటారు తల్లిదండ్రులు.. కన్నకూతురు కాబట్టి అది వారి బాధ్యత. అలాంటిది తమ ఇంట్లో సభ్యుడిగా ఉన్న ఆవుకు సీమంతం చేసి గొప్ప మనసును చాటుకున్నారు ఓ యజమాని

కూతురు తల్లి కాబోంతుందని ఆ కూతురిని కన్న తల్లిదండ్రులు పొందే ఆనందం వెలకట్టలేనిది.. తమ బిడ్డకు సీమంతం చేసి.. వూరంతా పండుగ చేస్తుంటారు తల్లిదండ్రులు.. కన్నకూతురు కాబట్టి అది వారి బాధ్యత. అలాంటిది తమ ఇంట్లో సభ్యుడిగా ఉన్న ఆవుకు సీమంతం చేసి గొప్ప మనసును చాటుకున్నారు ఓ యజమాని.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో గర్భం దాల్చిన ఆవుకు సీమంతం చేయడం ఆ ప్రాంతంలో విశేషంగా చెప్పుకుంటున్నారు. వెలిచేరుకు చెందిన శ్రీసత్యసాయి మెడికల్ షాపు యజమాని వరదా సుబ్బారావు ఇంట్లో ఉంటున్న ఆవు గర్భం దాల్చడంతో.. కూతురికి చేసినట్లే సీమంతం చేయాలనుకున్నారు.

అంతే ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ వూరందరినీ సీమంతానికి పిలిచారు. ఆవుకు ఆభరణాలు, పట్టువస్త్రాలు పెట్టి... గ్రామస్తులకు విందు భోజనం పెట్టారు. ఆవును కన్న కూతురిగా భావించిన ఆ దంపతులను గ్రామస్తులు అభినందించి.. ఆవును దీవించి వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్