కోనసీమలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తల్లీ కూతుళ్ళ సజీవదహనం.. హత్య చేసి తగలబెట్టారా? (వీడియో)

Published : Jul 02, 2022, 10:28 AM IST
కోనసీమలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తల్లీ కూతుళ్ళ సజీవదహనం.. హత్య చేసి తగలబెట్టారా?  (వీడియో)

సారాంశం

కోనసీమలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరు సజీవదహనం అయ్యారు. అయితే ఈ ఘటనమీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూతురు ప్రేమవివాహంతోనే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటున్నారు.

అమలాపురం : ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ కూతుళ్లు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లికూరుర్లు సజీవదహనం అయ్యారు. వీరిని సాధనాల మంగాదేవి (40),మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు. మరో విషాదం ఏమిటంటే మెడిశెట్టి జ్యోతి ఇప్పుడు గర్భవతి. ఈమె ఐదు నెలల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను కాదని తానిష్టపడ్డ వ్యక్తిని పెళ్లిచేసుకోవడం, గర్భవతి కావడంతో.. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కూతురిని, అడ్డువచ్చిన తల్లిని హత్య చేసి ఇల్లు తగలబెట్టారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన  అల్లవరం పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

వివాహితపై భర్త, అత్తామామల దాడి.. పిల్లల ఎదుటే గొంతునులిమి హత్య..

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?