
నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను వారి అకౌంట్ లలోనే వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలోని అన్ని శాఖల్లో రెవెన్యూ బాగా తగ్గిందని తెలిపారు. బ్యాంకు ఖాతా లేనివారు అకౌంట్లు తెరవాలని కోరుతున్నామన్నారు.
ఇకపై రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, నగదు రహిత లావాదేవీల కోసం శిక్షణ ఇస్తామని తెలిపారు.
నోట్ల రద్దు పరిమాణంను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల్లో 1252 కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరింత కరెన్సీ పంపమని ఆర్ బిఐని కోరుతున్నామన్నారు.
ప్రస్తుతం ఉన్న అన్ని పాస్ మిషన్లు అన్నీ యాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, రూ. రెండు వేల నోటు అవసరం లేదని, దీనిపై చర్చ జరగాలని మరోసారి స్పష్టం చేశారు.