చంద్రబాబుకు మోడి షాక్

First Published Dec 5, 2017, 7:25 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద షాక్ ఇచ్చారు.

చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద షాక్ ఇచ్చారు. అదికూడా గుజరాత్ ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబుకు షాక్ ఇవ్వటం గమనార్హం. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడు రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మాన చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. గుజరాత్ ఎన్నికల్లో మోడి మాట్లాడుతూ, ‘50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీ అవుతుంది’ అంటూ ప్రకటించారు. అంటే అర్ధమేంటి? ఏపిలో ఇప్పటికే రిజర్వేషన్ల శాతం 50 శాతం ఉంది. తాజాగా కాపులకు ఇచ్చిన 5 శాతంతో అది 55 శాతానికి చేరుకుంది. అంటే మోడీ మాటల ప్రకారం చంద్రబాబుది తప్పుడు హామీనే కదా?

అదేవిధంగా, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రింకోర్టు విధించిన యాబైశాతం పరిమితిని దాటే ఉద్దేశ్యం తమకు లేదని కూడా తేల్చి చెప్పారు. కాపులను బిసిల్లో కలుపుతూ అదనంగా 5 శాతం ఏపి అసెంబ్లీ తీర్మానం చేసి అమలు చేయాలంటూ కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. మోడి తాజా ప్రకటన ప్రకారం ఏపి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం అమోదించే అవకాశాల్లేవు. ఏపికి వర్తించే విధానమే తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లకూడా వర్తిస్తుందని మోడి చెప్పకనే చెప్పారు.

పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లోకి చేరుస్తానంటూ ఆచరణ సాధ్యం కాని హామీనిచ్చి చంద్రబాబు లబ్దింపొందారు. తానిచ్చిన హామీ అమలు సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా జనాలను మాయ చేసి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి రాగానే హామీని పక్కన పడేశారు.

అయితే, రిజర్వేషన్ల కోసమంటూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఆందోళనను తట్టుకోలేక మంజూనాధ కమీషన్ వేశారు. తీరా ఛైర్మన్ మంజూనాధ నివేదిక ఇవ్వకుండానే సభ్యులిచ్చిన నివేదిక అంటూ ఓ నివేదికను మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. దాన్నే అసెంబ్లీలో కూడా పెట్టి తీర్మానం చేయించి కేంద్రానికి పేంపాశారు. తన భారాన్ని కేంద్రంపై నెట్టేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా  లబ్ది పొందుదామన్న చంద్రబాబు ఆలోనకు మొదట్లోనే మోడి నీళ్ళు చల్లేశారు.

 

click me!