చంద్రబాబుపై మోడిలో అంతటి కసుందా ?

First Published Apr 4, 2018, 11:53 AM IST
Highlights
మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో చంద్రబాబు జాతీయ పార్టీల నేతలతో సమావేశమై సంగతి అందరికీ తెలిసిందే.

చంద్రబాబునాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోడి మండిపోతున్నారా? లేకపోతే ఏకంగా కక్షగట్టారా? రెండింటిలో ఏదైనా జరగొచ్చనేందుకు తాజాగా  జరిగిన ఓ ఘటనే నిరదర్శనం. మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో చంద్రబాబు జాతీయ పార్టీల నేతలతో సమావేశమై సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబు జరిపిన భేటీ కూడా మోడికి వ్యతిరేకంగానే.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు భేటీ కూడా జరిగింది. అదే సందర్భంలో మోడి లోక్ సభలో నుండి రాజ్యసభలోకి వెళ్ళాల్సొచ్చింది. అంటే సెంట్రల్ హాలు గుండానే వెళ్ళాలి. కాబట్టి  చంద్రబాబున్న హాలులో నుండే మోడి వెళిపోయారు.

మోడి హాలులోకి ప్రవేశించే సమయానికి అక్కడున్న నేతల్లో పలువురు మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు. అయితే, మోడి అక్కడున్న వారిలో పలువురిని కంటితోనే పలకరిస్తూ చంద్రబాబును మాత్రం కనీసం పట్టించుకోలేదు. చూసిన వాళ్ళ అందరూ ఆశ్చర్యపోయారు.

నిన్నటి వరకూ చంద్రబాబు ఎన్డీఏలో మిత్రుడే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఎంతటి ప్రతిపక్షమైనా రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఎదురుపడినపుడు కనీసం పలకరించక పోవటం గమానార్హం. జరిగిన ఘటన మోడి మనస్తత్వానికి స్పష్టంగా అర్ధం పడుతోందని పలువురు చెప్పుకున్నారు. ఎందుకంటే,  ప్రధానమంత్రి కాగానే ఒకవిధంగా  రాజకీయగురువైన ఎల్ కె అద్వానీ  విషయంలో మోడి ప్రవర్తిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. అటువంటిది చంద్రబాబు విషయంలో మోడి ప్రవర్తనలో ఆశ్చర్యం లేదని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.

click me!