బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు మొత్తం ఖాళీ..

First Published Dec 7, 2017, 7:28 AM IST
Highlights
  • పెద్ద నోట్ల రద్దు..జిఎస్టీ..ఇదే పరంపరలో నరేంద్రమోడి ప్రభుత్వం మధ్య తరగతి జనాల నెత్తిన మరో దెబ్బ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

                 పెద్ద నోట్ల రద్దు..జిఎస్టీ..ఇదే పరంపరలో నరేంద్రమోడి ప్రభుత్వం మధ్య తరగతి జనాల నెత్తిన మరో దెబ్బ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు దాచుకుంటున్నారా? అయితే, ఆ విషయమై ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారా ? అయితే కచ్చితంగా మీరు చదవాల్సిందే.  మీరే చదవండి. కేంద్రప్రభుత్వం త్వరలో ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్ఆర్డిఐ) బిల్లు తేబోతోంది. ఈ బిల్లు గనుక పార్లమెంటు ఆమోదం పొంది చట్టమైతే ఖాతాదారుల కొంప కొల్లేరే అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ఇంతకీ ఆ బిల్లులో ఏముందంటారా ? గతంలో ఏదైనా బ్యాంకు డివాలా తీస్తే ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసి బ్యాంకు రుణాలను తీర్చేది. అంటే డిపాజిట్ దారులు దాచుకున్న మొత్తంలో మొత్తం కాకపోయినా ఎంతో కొంతైనా  ఖాతాదారులకు అందేట్లు చూసేది. దాన్నే ఆర్దిక పరిభాషలో ‘బెయిల్ అవుట్’ అంటారు. అయితే, తాజాగా ‘బెయిల్ ఇన్’ అనే క్లాజును ఎఫ్ఆర్డిఐ బిల్లులో చేర్చారు.

పైన చెప్పుకున్న ఎఫ్ఆర్డిఐ బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే పై చట్టం రూపంలో ఓ కార్పొరేషన్ సదరు బ్యాంకును టేకోవర్ చేస్తుంది. ఏడాది పాటు దివాలా నుండి బయటపడేందుకు అవసరమైన సాయం చేస్తుంది. చేసే సాయం కేవలం బ్యాంకుకే తప్ప ఖాతాదారులకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. బెయిల్ ఇన్ నిబంధనల ప్రకారం ఖాతాదారుల సొమ్మును బ్యాంకు చక్కగా వాడేసుకోవచ్చు. అంటే ఖాతాదారుల సొమ్మును ఖాతాదారుల సమ్మతి అవసరం లేకుండానే పెట్టుబడిగా పెట్టి బయటనుండి మరిన్ని అప్పులు తీసుకోవచ్చు. విచిత్రమేంటంటే, ఖాతాదారుల అప్పులన్నింటినీ ఒకేసారి రద్దు కూడా చేసేయొచ్చు. అంటే ఖాతాదారులకు సదరు బ్యాంకు నయాపైసా కూడా చెల్లించక్కర్లేదన్న మాట.

పిల్ల పెళ్ళికో, పిల్లాడి చదువుకో, ఇల్లుకట్టుకోవటం కోసమనో,  వైద్య ఖర్చులకనో దాకుకున్న ఖాతాదారుల డబ్బు మొత్తం ఒక్క నిముషంలో మాయమైపోతుంది. అంతేకాదు ఫిక్సుడు ఖాతాలో మీరు ఓ ఐదేళ్ళకు డబ్బును దాచుకున్నారనుకోండి. దాన్ని బ్యాంకు తమ అవసరాలకు మీకు చెప్పకుండానే ఓ 20 ఏళ్ళకు మార్చేసుకోవచ్చట. అంటే మీ డబ్బు మీద మీకేమీ అధికారం లేదన్న మాట. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటరీ కమిటి పరిశీలనలో ఉంది. కమిటీ గనుక ఆమోదిస్తే మంత్రివర్గంలో ఆమోదం పొంది పార్లమెంటులో ఓటింగ్ కు వచ్చి చట్టమైపోవటం ఖాయం. అంటే త్వొరలో ఖాతాదారుల కొంప కొల్లేరవ్వటం ఖాయమన్న మాట.

 

click me!