‘‘పవన్ గారు.. మరి చిరంజీవి కేంద్ర మంత్రి ఎలా అయ్యారు’’..బుద్దా వెంకన్న

First Published 10, Jul 2018, 1:23 PM IST
Highlights

మంత్రి లోకేష్ పై చేసిన కామెంట్ కి కౌంటర్ వేసిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ వేశారు.  లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వడంపై గత కొంతకాలంగా పవన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

తన అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రి ఎలా అయ్యారో తమ్ముడు పవన్ కల్యాణ్ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్‌పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. 

బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ముందు పవన్ ఆలోచించుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంఘవిద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అడిగితే సామాన్యులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రుజువు చేయగలరా..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు

Last Updated 10, Jul 2018, 1:23 PM IST