సుబ్రమణ్యం హత్య: జీజీహెచ్‌లో ఎమ్మెల్సీ అనంతబాబుకి వైద్య పరీక్షలు పూర్తి

By narsimha lode  |  First Published May 23, 2022, 8:31 PM IST

కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబును ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సోమవారం నాడు రాత్రి కాకినాడ జీజీహెచ్ లో అనంతబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. 



కాకినాడ: కారు డ్రైవర్ Subramanyam హత్య కేసులో YCP  ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ Anathababuను సోమవారం నాడు రాత్రి ఎస్పీ ఆఫీసుకి తరలించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో  వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత MLC ని SP  కార్యాలయానికి తరలించారు.

కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో  ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసలుు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఈ విషయమై డీఐజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి Kakinada  జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సుమారు అరగంటకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులకు ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారని సమాచారం.

Latest Videos

undefined

 ఆసుపత్రిలో పరీక్షలు పూర్తైన తర్వాత ఎమ్మెల్సీ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. రిమాండ్ కు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి పార్మాలిటీస్ ను పూర్తి చేసేందుకు అనంతబాబును ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టుగా సమాచారం. మరో వైపు అనంతబాబు అరెస్ట్ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడమే కాకుండా శాసనమండలి చైర్మెన్ కు, అసెంబ్లీ సెక్రటరీకి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

also read:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

మరో వైపు వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులపై కూడా ఎమ్మెల్సీ సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు శాఖ ప్రకటించింది. వీటన్నింటిని పూర్తి చేసేందుకు గాను ఎస్సీ కార్యాలయానికి ఎమ్మెల్సీని తరలించినట్టుగా చెబుతున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి కాగానే జడ్జి ముందు ఎమ్మెల్సీ అనంతబాబును హాజరు పర్చనున్నారు పోలీసులు.

సుబ్రమణ్యం తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొంటున్నందునే అతడిని బెదిరించాలని భావించినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో  కొట్టిన దెబ్బలకు సుబ్రమణ్యం మరణించాడని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ విషయమై పోలీసులు  మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సుబ్రమణ్యం మరణానికి సంబంధించి తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఎమ్మెల్సీ ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యలకు ఎమ్మెల్సీ సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సుబ్రమణ్యం చనిపోయాడని డెడ్ బాడీని తీసుకొచ్చి కారులో మృతుడి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.

సుబ్రమణ్యం మృతికి ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాదు సుబ్రమణ్యం కుటుంబాన్ని ఆదుకొంటామని కూడా ప్రకటించారు.  ఆదివారం నాడు రాత్రి ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అనంతబాబు తమ అదుపులోనే ఉన్నాడని కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ సోమవారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు. 

సోమవారం నాడు సాయంత్రం ఎస్పీ కార్యాలయం నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి  అనంతబాబును తరలించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు.  ఇవాళ రాత్రే ఆయనను జడ్జి ఎదుట హాజరు పర్చనున్నారు.
 

click me!