టీడీపీకి పట్టిన శని : లోకేష్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

Published : May 23, 2022, 06:41 PM ISTUpdated : May 23, 2022, 06:42 PM IST
టీడీపీకి పట్టిన శని : లోకేష్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

సారాంశం

టీడీపీ నేత నారా లోకేష్ ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఇష్టారీతిలో మాట్లాడితే తగిన బుద్ది చెబుతామన్నారు. ఇవాళ మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

తాడేపల్లి:లోకేష్ TDP కి పట్టిన శనిగా ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి Ambati Rambabu చెప్పారు. 
సోమవారం నాడు ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు.ఈ విషయమై సీఎం YS Jagan స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని అంబటి రాంబాబు చెప్పారు.లోకేష్ ఏకవచనంతో  మాట్లాడడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు. దిగజారి మాట్లాడడం మానుకోవాలని  మంత్రి అంబటి రాంబాబు లోకేష్ కు హితవు సూచించారు. 

ఈ రకంగా మాట్లాడితే తాము  సహించబోమని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఏదైనా అసెంబ్లీ  స్థానం నుండి గెలిచి మాట్లాడాలని లోకేష్ కు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. రాజకీయాల్లో Nara Lokesh పనికిరాడన్నారు.

 2018లోనే polavaram ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన Chandrababu Niaud, దేవినేని ఉమలు ఎందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. అశాస్త్రీయంగా వ్యవహరించడం వల్లే పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. దీనికి చంద్రబాబు సర్కార్  కారణమని అంబటి రాంబాబు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా డయా ఫ్రం వాల్ ఎక్కడా కూడా దెబ్బతినలేదన్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయా ఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్ధితి నెలకొందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం