చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య: గొల్లున నవ్విన ఎమ్మెల్యేలు

Published : Jul 11, 2019, 04:12 PM IST
చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య: గొల్లున నవ్విన ఎమ్మెల్యేలు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వర్షాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరవుపై జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వర్షాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరవుపై జరిగిన చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసిన తర్వాత  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

2009 ఎన్నికల సమయంలో  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీడీపీ ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహాకూటమి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని చంద్రబాబు తరపున ఓ వర్గం మీడియా ప్రచారం చేసిందన్నారు.

అయితే  ఈ ప్రచారానికి భయపడి మేఘాలు పారిపోయాయన్నారు. కానీ,  2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తోందని  భయపడి పారిపోయిన మేఘాలు వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే తిరిగి వచ్చాయన్నారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ విషయాన్ని  తమకు వైఎస్ఆర్ చెప్పారన్నారు.  కరువుపై చర్చ సందర్భంగా  టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై  ఆయన స్పందించారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత  వర్షాలు కురవడం లేదని రామానాయుడు  అన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తన ప్రసంగంలో  కౌంటరిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కూడ కరవు పరిస్థితులు ఉన్న విషయాన్ని కూడ కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చినట్టుగా కూడ ఆయన గుర్తు చేశారు.


సంబంధిత వార్తలు

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పడిపడి నవ్విన జగన్

బాబు వర్సెస్ జగన్: వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు

బావమరిది శవాన్ని పక్కనే పెట్టుకొని పొత్తులు మాట్లాడారు: బాబుపై జగన్

నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు