భక్తులకు చేదు వార్త.. శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు

By telugu teamFirst Published Nov 13, 2019, 10:41 AM IST
Highlights

ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్‌ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
 


తిరుమల శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు కానుందా..? అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతోంది. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లడ్డూల పంపిణీ, విక్రయాల్లో ఇప్పటివరకూ ఉన్న రాయితీలన్నిటినీ రద్దు చేయాలని టీటీడీ యోచిస్తోంది. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఒకటి ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. 

ఆపైన ప్రతి లడ్డూ రూ.50కి విక్రయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్‌ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.

కళ్యాణ ఉత్సవ లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200 చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదంలో ఇచ్చే వడ ధర కూడా పెంచారు. గతంలో దాని ధర రూ.25 ఉండగా... ఇప్పుడు దానిని రూ.100 చేశారు.

AlsoRead మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు...

ఇదిలా ఉండగా.. తిరుపతి స్వామివారి లడ్డూ మరింత రుచి అదనంగా లభించనుంది.ఆ రుచి కేరళ రాష్ట్రం నుంచి అందనుంది. ఏంటి అర్థం కాలేదా..? కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జీడిపప్పుకి ప్రాముఖ్యత ఎక్కువ.ఆ జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జీడిపప్పుని... స్వామివారి లడ్డు ప్రసాదంలో కలపనున్నారు. ఈ మేరకు టీటీడీ కేరళ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. కొల్లాం జీడిపప్పుకి నాణ్యత ఎక్కువ.

అందుకే ఆ జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 

click me!