తాడిపత్రిలో టెన్షన్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

Published : Dec 24, 2020, 03:07 PM IST
తాడిపత్రిలో టెన్షన్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

సారాంశం

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.  

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.

సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కోపంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఇద్దరిపై దాడికి దిగారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఈ సమయంలో జేసీ ఇంటి వద్ద ఉన్న టీడీపీ వర్గీయులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగి దాడికి దిగారు. ఈ ఘటన జరిగిన సమయంలో  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు.   ఈ విషయం తెలుసుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకొని పెద్దారెడ్డి వర్గీయులపై రాళ్లదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకొన్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. 

also read:తాడిపత్రిలో టెన్షన్: అనుచరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ

ఈ ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనం ధ్వంసమైంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీని కూడ లెక్క చేయకుండా ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu