ఎస్ఈసీ ఆదేశాలు : హైకోర్టులో జోగి రమేష్ లంచ్ మోషన్ పిటిషన్

By AN TeluguFirst Published Feb 12, 2021, 3:52 PM IST
Highlights

ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్ కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్ కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

పెడనలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురు ఎవరు పోటీకి దిగినా... వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తానని హెచ్చరించారు.  దీనిపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. 

జోగి రమేష్ మాట్లాడిన వీడియో ఆధారాలు ఉండడంతో ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది. 

కాగా.. జోగి రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎవరైనా వేరే పార్టీ తరఫున వార్డు సభ్యునిగ నిలబడితే వాళ్ల ఇంట్లో వాళ్లకు ప్రభుత్వ పతకాలు కట్ చేస్తా.. జగనన్న పథకాలు తీసుకుంటూ, వ్యతిరేకంగా నిలబడితే వాళ్ల ఇంట్లో ఉన్న పింఛన్‌, కాపునేస్తం, అమ్మఒడి ప్రతి ఒక్కటీ కట్ చేసి పడేస్తా. సమస్యే లేదు. మొహమాటం కూడా లేదు..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

click me!