ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు: షోకాజ్‌కి మంత్రి కొడాలి సమాధానం

Published : Feb 12, 2021, 03:17 PM ISTUpdated : Feb 12, 2021, 03:20 PM IST
ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు: షోకాజ్‌కి మంత్రి కొడాలి సమాధానం

సారాంశం

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శుక్రవారం నాడు లేఖ రాశారు.  


అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శుక్రవారం నాడు లేఖ రాశారు.

ఎస్ఈసీని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారనే  నెపంతో మంత్రి కొడాలి నానికి ఇవాళ ఉదయం ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు పంపింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపుగా ఈ షోకాజ్ కు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

also read:కొడాలికి షాక్: షోకాజ్ నోటీసిలిచ్చిన ఎస్ఈసీ

ఈ షోకాజ్ నోటీసులపై మంత్రి నాని స్పందించారు. షోకాజ్ నోటీసులు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఎస్ఈసీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. తన మాటల్లో నిజమైన భావాలను ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్నారు. ఎస్ఈసీని కించపర్చే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎస్ఈసీని అవమానపర్చేలా తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు.

తొలి విడత జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్న సమయంలో తాను వ్యాఖ్యలు చేశానని ఆయన తెలిపారు. తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని నాని ఆ లేఖలో కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్