ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. కోటంరెడ్డికి బాలయ్య ఫోన్

Published : Jul 22, 2020, 08:36 AM IST
ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. కోటంరెడ్డికి బాలయ్య ఫోన్

సారాంశం

కావలిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం  నిర్వహించాలని ఆయనకు సూచించారు. కాగా బాలయ్యకు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడన్న విషయం విదితమే.

నెల్లూరు జిల్లాలోని కావలిలో ఇటీవల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇప్పటికే.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు. 

తాజాగా దీనిపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేశారు. కావలిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం  నిర్వహించాలని ఆయనకు సూచించారు. కాగా బాలయ్యకు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడన్న విషయం విదితమే.

కాగా.. అంతకు ముందు కోటంరెడ్డి ఆధ్వర్యంలో బాలయ్య అభిమానుల సమావేశమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై భవిష్యత్తు కార్యాచరణకు పూనుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ‘రెడ్ జోన్’ అని అడ్డుకున్నారు. దీంతో ఫ్యాన్స్ వర్సెస్ పోలీసులుగా పరిస్థితులు మారాయని తెలుస్తోంది. మరింత మంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలియవచ్చింది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu