రఘురామపై ఎమ్మెల్యే జోగీ రమేష్ తిట్లు: థ్యాంక్స్ చెప్పిన వైఎస్ జగన్

By telugu teamFirst Published May 20, 2021, 4:10 PM IST
Highlights

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై శానససభలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ వ్యాఖ్యలకు సీఎం వైఎస్ జగన్ ధన్యావాదాలు తెలిపారు.

అమరావతి: తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా జోగి రమేష్ రఘురామపై తీవ్రమైన విమర్శలు చేశారు. 

రఘురామ పార్టీ గుర్తుతో, తమ పార్టీ నేత ఫొటోతో గెలిచారని, రఘురామ రాజీనామా చేస్తే వార్డు మెంబర్ గా కూడా గెలువలేరని ఆయన అన్నారు. రఘురామపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తిట్టాల్సినంత టిట్టి విచారం వ్యక్తం చేశారు. వేరే సభ్యలో సభ్యుడు అయిన వ్యక్తి గురించి విమర్శించడం తప్పని అంటూ తాను మాట్లాడిన విషయాల్లో తప్పులుంటే రికార్డుల నుంచి తొలగంచాలని ఆయన స్పీకర్ ను కోరారు. 

రఘురామపై ఆయన అనుచితమైన పదజాలం వాడారు. ఆ పదప్రయోగం చేసిన తప్పుంటే క్షమించాలని కూడా జోగి రమేష్ అన్నారు. కుట్ర చేసిన రఘురామనే కాదు, కుట్ర వెనక అందరినీ అరెస్టు చేయాలని ఆయన అన్నారు. వెన్నుపోటు దారుల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షుడని ఆయన వ్యాఖ్యానించారు.

దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిస్పందించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని, అందుకు జోగి రమేష్ కు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన అన్నారు.  తప్పు చేసి ఉంటే రికార్డుల నుంచి ఆ పదాలను తొలగించాలని జోగి రమేష్ ను కోరినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని ఆయన అన్నారు. 

తప్పుంటే విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేష్ కోరినప్పటికీ స్పీకర్ తమ్మినేని సీతారాం మౌనంగా ఉండిపోయారు. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించలేదు.

click me!