ఆనందం.....................షాక్

Published : Mar 06, 2017, 12:57 PM ISTUpdated : Mar 24, 2018, 12:09 PM IST
ఆనందం.....................షాక్

సారాంశం

సమాధి కట్టేసామని అనుకుంటున్న ఓటుకునోటు కేసు ‘వొదల బొమ్మాళీ నిన్నొదల’ అన్నట్లుగా హటాత్తుగా సుప్రింకోర్టులో లేచికూర్చుంది.

ఒకవైపు ఆనంధం. ఇంకోవైపు షాక్. రాష్ట్ర చరిత్రలో అపూర్వ ఘట్టమనే విధంగా వెలగపూడిలో అసెంబ్లీ భవనంలో మొదటిసారి అసంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇంకోవైపు ప్రజా జీవితంలోకి మొదటిసారిగా అడుగుపెట్టేందుకు ఎంఎల్సీ గా లోకేష్ నామినేషన్ వేశారు.  గవర్నర్ ప్రసంగం మొదలైంది. ఇంతలో ఓటుకునోటు కేసులో సుప్రింకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం. మొదటి మూడు ఘటనలతో చంద్రబాబులోని సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. సమాధి కట్టేసమని అనుకుంటున్న ఓటుకునోటు కేసు ‘వొదల బొమ్మాళీ నిన్నొదల’ అన్నట్లుగా హటాత్తుగా సుప్రింకోర్టులో లేచికూర్చుంది. అందులోనూ కేసు విచారణకు స్వీకరిస్తూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇంకా కీలకం. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం క్రిందకే వస్తుందని స్పష్టం చేసారు. అవినీతి జరిగిందని అనుకున్నపుడు ఎవరైనా ప్రశ్నించవచ్చని చేసిన వ్యాఖ్యలు చంద్రబును నేరుగా తాకటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?