కాలువలో గల్లంతైన ఎస్ఐ వంశీధర్ మృతదేహాం వెలికితీత

By narsimha lodeFirst Published Aug 26, 2018, 1:18 PM IST
Highlights

విజయవాడ- ఆవనిగడ్డ కరకట్టపై కాలువలో కొట్టుకుపోయిన ఎస్ఐ వంశీధర్ మృతదేహం ఆదివారం నాడు దొరికింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం శివారులో అన్నవరం-మంగళాపురం గ్రామాల మధ్య తొమ్మిదో నెంబర్ పంట కాలువలో ఎస్ఐ మృతదేహాన్ని ఆదివారం నాడు వెలికితీశారు.
 

విజయవాడ: విజయవాడ- ఆవనిగడ్డ కరకట్టపై కాలువలో కొట్టుకుపోయిన ఎస్ఐ వంశీధర్ మృతదేహం ఆదివారం నాడు దొరికింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం శివారులో అన్నవరం-మంగళాపురం గ్రామాల మధ్య తొమ్మిదో నెంబర్ పంట కాలువలో ఎస్ఐ మృతదేహాన్ని ఆదివారం నాడు వెలికితీశారు.

శుక్రవారం నాడు ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కాలువలో ఎస్ఐ వంశీధర్ ప్రయాణీస్తున్న వాహనం పడిపోయింది. కోట వంశీధర్‌ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. 

శనివారం ఉదయం తన తల్లిని తీసుకుని స్వగ్రామమైన కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్‌ బేగ్‌పేటకు కారులో బయల్దేరారు. విజయవాడ-అవనిగడ్డ మధ్య కరకట్టపై ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద ఊహించని ప్రమాద ఘటనతో కారు కాల్వలోకి పల్టీ కొట్టింది. 

అనూహ్యంగా కారు కాలువలో పడిపోవడంతో కారులో ఉన్న ఎస్ఐ తల్లిని స్థానికులు రక్షించారు. మరోవైపు ఎస్ఐ ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు  వైఫల్యమయ్యాయి. కారు పడిపోయిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎస్ఐ వంశీధర్ మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు.

ఈ వార్త చదవండి

పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు: ఎస్సై వంశీ గల్లంతు
 

click me!