మంత్రి ఆర్‌కే రోజా మొబైల్ ఫోన్ మిస్సింగ్ కలకలం.. అంతలోనే..

By SumaBala BUkkaFirst Published Apr 22, 2022, 8:51 AM IST
Highlights

పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఉన్నప్పుడు మంత్రి ఆర్ కే రోజా తన సహాయకుల్లో ఒకరికి ఫోన్‌ ఇచ్చారని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఎన్‌.రవీంద్ర తెలిపారు. 

నెల్లూరు : Nellore SV Universityలో కాసేపు గందరగోళం ఏర్పడింది. పర్యాటక శాఖ మంత్రి RK Roja మొబైల్ ఫోన్ కాసేపు కనిపించకుండా పోయింది. దీంతో దొంగతనం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ.. అసలేం జరిగిందంటే...

ఎస్వీ యూనివర్సిటీలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా Mobile phoneను ఎవరో దొంగిలించారని మీడియాలో వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు.పద్మావతి గెస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు మంత్రి తన సహాయకుల్లో ఒకరికి ఫోన్ ఇచ్చారని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రవీంద్ర తెలిపారు. అయితే ఎస్వీయూలో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత రోజా ఫోన్ కోసం వెతుకుతున్న సమయంలో సహాయకుడు ఫోన్ జేబులో పెట్టుకున్న సంగతి మర్చిపోయారు. 

ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండడంతో నంబర్‌ను డయల్ చేసి ఫోన్‌ను ట్రేస్ చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని సీఐ తెలిపారు. కొంతసేపటికి సహాయకుడు ఫోన్ తన జేబులోనే ఉందని గ్రహించి మంత్రికి తిరిగి ఇచ్చాడు. అనంతరం మంత్రి వెంట ఉన్న పోలీసులు, ఇతరులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రోజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తరువాత రోజా మాట్లాడుతూ.. గండికోట టూ బెంగళూర్, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీస్‌ను ప్రారంభిస్తూ మంత్రిగా తొలిసంతకం చేసినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయని.. విశాలమైన తీరరేఖ ఉందని ఈ సందర్భంగా తెలిపారు. చాలా ప్రాంతాలు టూరిజానికి అనువుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. 

దేశ, విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో రూపొందిస్తామని చెప్పారు. విదేశీ పర్యాటకులను ప్రోత్సహించేలా అభివృద్ది చేస్తాం. పర్యాటక శాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం జగన్ పాలన చూసి ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. తనపై సీఎం జగన్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. సీఎం జగన్ లాంటి నేతతో కలిసి నడవడం తమ అదృష్టమన్నారు. తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.. కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.. అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు. 

క్రీడాకులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. గ్రామీణ క్రీడాకరులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని తెలిపారు.క్రీడాకారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తమకు తెలుసన్నారు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని రోజా తెలిపారు.

click me!