అక్క భర్తతో అక్రమ సంబంధం...కట్టుకున్నోడిని కడతేర్చిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష...

Published : Apr 22, 2022, 07:49 AM IST
అక్క భర్తతో అక్రమ సంబంధం...కట్టుకున్నోడిని కడతేర్చిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష...

సారాంశం

పెళ్లికి ముందునుంచే అక్కభర్తతో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. పెళ్లైన తరువాత భర్తకు విషయం తెలియడంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది. ఆమెతో పాటు సహకరించిన బావ, మరో ఇద్దరికి జీవితఖైదు విధించింది కోర్టు.   

నాదెండ్ల : పవిత్రమైన వివాహబంధాన్ని అపహాస్యం చేస్తూ ఓ భార్య ఏకంగా భర్త ప్రాణాలు బలితీసుకుంది. extramarital affair మత్తులో పడి విలువలకు తిలోదకాలు ఇచ్చింది. అడ్డుగా ఉన్నాడని తాళికట్టిన husbandను అంతం చేసింది. ఆపై suicide అంటూ నాటకం ఆడింది. పోలీసుల దర్యాప్తులో గుట్టు రట్టు కాగా.. ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళింది. ఈ కేసులో గురువారం నరసరావుపేట కోర్టు మృతుని భార్య, ఆమె బావ మరో ఇద్దరికి life imprisonment విధించింది.

అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను అడ్డు తొలగించిన భార్య, ఆమెకు సహకరించిన బావ, మరో ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం..  ఫిరంగిపురం మండలం పొనుపాడికి చెందిన నల్లబోతు నరేంద్ర తన సమీప బంధువు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని శ్రీవిద్యను వివాహం చేసుకున్నాడు.  అతను పేరేచర్ల పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వీరికి సంతానం లేదు. పెళ్లికి ముందు నుంచి తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో శ్రీవిద్యకు వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి అయ్యాక ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని.. భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నరసరావుపేట పెద్ద చెరువులో నివసించే అక్క ఇంటినుంచే కుట్రకు తెరలేచింది.

2017 డిసెంబర్ 19న భర్తకు బావతో ఫోన్ చేయించి, నరసరావుపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ కి రప్పించింది. గతంలో పరిచయం ఉన్న మిత్రులు, బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల కు చెందిన బాలరాజు, ఈపూరు మండలం ముప్పాళ్ళకి చెందిన పూజల చౌడయ్యతో కలిసి ఆ రోజు రాత్రి అంతా రెస్టారెంట్ లోనే గడిపారు. బాకీ వసూలుకు మార్కాపురం వెళుతున్నట్లుగా చెప్పి తోడుగా నరేంద్ర సాయం కోరారు.  అతనిని కారులో ఎక్కించుకొని వినుకొండ వైపు బయలుదేరారు. మధ్యలో  మద్యంలో సైనేడ్ కలిపి, నరేంద్రతో సాగించగా..  కారులోనే చనిపోయాడు. తిరిగి మృతదేహాన్ని తీసుకొచ్చి సాతులూరు వద్ద పెదనందిపాడు బ్రాంచ్  కాలువ కట్ట మీద పడేసారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు  మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా పెట్టి వెళ్ళిపోయారు.

హతుని తండ్రి ఫిర్యాదుతో బట్టబయలు.. నిందితులను పట్టిచ్చిన చెప్పు..
నరేంద్ర మృతి అనుమానాస్పదంగా ఉండటంతో.. అతని తండ్రి వీరయ్య నాదెండ్ల పోలీసులకు 2017 డిసెంబర్ 20న ఫిర్యాదు చేశారు. అప్పటి చిలకలూరిపేట గ్రామీణ సీఐ శోభన్ బాబు కేసు దర్యాప్తు చేశారు. మృతుని కాలికి ఉన్న ఒక చెప్పుపై అనుమానం తలెత్తింది. దీంతోపాటు  ఫోన్ కాల్స్ జాబితాను విచారించారు. రెండో చెప్పు హత్యకు వినియోగించిన కారులో లభించడంతో.. సాక్ష్యాధారాలతో సహా నిందితుడు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. నరసరావుపేట 13 జిల్లా అదనపు న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఫిర్యాది తరఫున  పిపి బాలహనుమంతరెడ్డి  వాదనలు వినిపించారు. అభియోగాలు రుజువు కావడంతో ముద్దాయిలు నలుగురికి  జీవిత ఖైదు, రూ.1000  జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu