అదృశ్యమైన బాలుడి అనుమానాస్పద మృతి: ఏం జరిగింది?

By narsimha lode  |  First Published Mar 15, 2021, 10:32 PM IST

జిల్లాలోని తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడు భార్గవ్ తేజ్ కథ విషాదాంతమైంది. ఆదివారం నాడు భార్గవ్ కన్పించకుండా పోయాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం నాడు ఇంటికి సమీపంలోని పొలాల్లో అతడి మృతదేహం లభ్యమైంది.



గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడు భార్గవ్ తేజ్ కథ విషాదాంతమైంది. ఆదివారం నాడు భార్గవ్ కన్పించకుండా పోయాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం నాడు ఇంటికి సమీపంలోని పొలాల్లో అతడి మృతదేహం లభ్యమైంది.

భార్గవ్ తేజ్ తండ్రి భగవానియా నాయక్   ఓ యూనివర్శిటీలో ఎలక్ట్రీషీయన్ గా పనిచేస్తున్నాడు. బాలుడు భార్గవ్ తేజ్ చంపాల్సిన అవరసం ఎవరికి వచ్చింది....అభం శుభం ఎరుగని బాలుడిని చంపి ఎందుకు పొల్లాలో పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos

హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా??లేదా ఇంక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. బాలుడిని కోతులు చంపి ఉంటాయనే వాదన కూడ తెర మీదికి వచ్చింది. ఈ వాదనను కుటుంబసభ్యులు కొట్టిపారేస్తున్నారు.

మా అబ్బాయిను ఎవరో కొట్టి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై, మోహంపై గాయాలున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 

ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కోతులు బాలుడును చంపి ఉంటే ఒళ్లంతా  గాయాలు ఉండాలని వారు చెబుతున్నారు. 

click me!