శానిటైజర్ తాగి... పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : May 21, 2021, 10:49 AM IST
శానిటైజర్ తాగి... పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

సారాంశం

పోలీస్ స్టేషన్ ఎదుటే ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కర్నూల్: కరోనా నుండి  ప్రాణాలు కాపాడుకోడానికి ఉపయోగించే శానిటైజర్  తాగి ప్రాణాలు తీసుకోడానికి ప్రయత్నించింది ఓ ప్రేమ జంట. ఈ విషాద సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు మైనర్లు కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అభ్యంతరం తెలపడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 

read more  కృష్ణా జిల్లాలో విషాదం: కరోనాతో దంపతుల ఆత్మహత్య, అనాథలైన పిల్లలు

ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిపై కిడ్నాప్ కేసు పెట్టారు. తమ అమ్మాయిని సదరు యువకుడు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు లోనయిన సదరు ప్రేమజంట పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

కరోనా నియంత్రణ కోసం ఉపయోగించే శానిటైజర్ బాటిల్ వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఈ ప్రేమజంట అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయిన వారిని పోలీసులు, స్థానికులు  కలిసి హాస్పిటల్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu